telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేటీఆర్‌ ఒక అసమర్థ మంత్రి..

టీఆర్‌ఎస్‌ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు Nvss ప్రభాకర్. గ్రేటర్ పరిధిలో 2106 ఓటర్ లిస్ట్ తో పోలిస్తే కొన్ని డివిజన్ లలో ఓట్లు తగ్గితే మరి కొన్ని డివిజన్ లలో ఓట్లు పెరిగాయని..డి లిమిటేషన్ చేయకుంటే ఒక్కో డివిజన్ ల్లో ఓట్లలో ఇంత భారీ తేడా ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఓటర్ల నమోదులో అక్రమాలు జరిగాయని.. తెలంగాణ భవన్, దారు సలాం లో కూర్చొని తయారు చేసినట్టు ఉందని ఆరోపణలు చేశారు. 7 వ తేదీ ఓటర్ల జాబితా ప్రకటిస్తామని..  అభ్యంతరాలకి రెండు రోజుల గడువు ఇస్తాము అంటే ఎలా అని నిలదీశారు.  అర్హుడైన ప్రతి వ్యక్తి కి ఓటు హక్కు కల్పించాలని..పురపాలన మంత్రులుగా తండ్రి కొడుకులే ఉన్నారని పేర్కొన్నారు. చెరువుల ఆక్రమణకు, అక్రమ కట్టడాలకీ, పన్నులు పెంచదానికీ కారణం తండ్రి కొడుకులేనని పనులు చేసింది మాత్రం లేదని ఫైర్‌ అయ్యారు. గ్రేటర్ 6 సార్లు వర్షానికి అతలాకుతలం అయిందని.. Ghmc లో ఏ సర్టిఫికెట్ కావాలన్న లంచం ఇవ్వాల్సిందేనన్నారు. కార్పొరేటర్ నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ trs వాళ్లేనని…హైదరాబాద్ లో రోగాలు ప్రబలదానికి కారణం వీల్లేనని మండిపడ్డారు. Ktr అసమర్థ మంత్రి అని..ఇసుక తెచ్చుకోవాలి అంటే కార్పొరేటర్ టాక్స్ కట్టాలని తెలిపారు. మూసి ప్రక్షాళన కోసం వాజపేయి ప్రధాని గా ఉన్నప్పుడు నిధులు వచ్చాయని… వాటిని divert చేశారు…అన్ని అంశాలు బయట పెడుతామని హెచ్చరించారు.

Related posts