telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి..తెలంగాణలో వర్షాలు

rain hyderabad

తెలంగాణ మరియు కోస్తా ఆంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫలితంగా ఈ రోజు అక్కడక్కడ ఉరుములతో జల్లులు కురిసాయి.

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ఈరోజు ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. వాతావరణం చల్లగా ఉంటుందని, ఇక రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు.

Related posts