telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

రైతులకు ట్రంప్ సర్కార్ చేయూత..19 బిలియన్ డాలర్ల ప్యాకేజీ!

trump usa

లాక్ డౌన్ తో అమెరికాలో వ్యవసాయరంగం కుదేలైన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రైతులను ఆదుకునేందుకు 19 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ట్రంప్‌ ఈ సాయం నేరుగా అన్నదాతకు అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అన్నదాతలను అన్ని విధాలా ఆదుకుంటాం అని ట్రంప్ తెలిపారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సోనీ పెరడ్యూ మాట్లాడుతూ వైరస్ విపత్తుతో వ్యవసాయానుబంధ విభాగాల వారు తీవ్రంగా నష్టపోయారు.

విద్యా సంస్థలు మూతపడడం, అమెరికన్లు ఇళ్లకే పరిమితం కావడంతో మార్కెట్‌ పూర్తిగా దెబ్బతింది. ఉత్పత్తులను కొనేవారు లేక ఆహార సరఫరా లింక్‌ దివాళా తీసింది. కొనుగోలుదారులు లేక తమ ఉత్పత్తులను రైతులు పంటపొలాల్లోనే నాశనం చేసుకోవాల్సిన దుస్థితి ఎదురయ్యింది. పాల ఉత్పత్తి దారుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుడు ప్రకటించిన సాయంలో 3 బిలియన్ డాలర్లను పాల ఉత్పత్తుల కొనుగోలుకు వెచ్చిస్తామని తెలిపారు.

Related posts