telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రామ్ సినిమాకు “నో” చెప్పిన ఓటిటి ?

Red

ఇటీవలే “ఇస్మార్ట్ శంకర్”తో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో రామ్. ఆయన ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ సినిమాని చేస్తున్నాడు. నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో రామ్ లుక్ పై ఓ వార్త సినీ వర్గాల్లో చెక్కర్లు కొడుతుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లో రామ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అందరిని మెస్మరైజ్ చేస్తుందని సమాచారం. ఎప్పుడు లవర్ బాయ్ గా కనిపించే రామ్ ఊర మాస్ లుక్ లో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇందులో రామ్ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టడంతో రామ్ మూవీకి కూడా ఓటీటీలు ఫ్యాన్సీ రేట్స్ ని ఆఫర్ చేసాయి. కానీ అప్పుడు దర్శకనిర్మాతలు ఈ సినిమాను థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే తాజా సమాచారం ప్రకారం… థియేటర్స్ ఇప్పుడప్పుడే తెరుచుకోవడం కష్టం అనుకున్న చిత్రబృందం సినిమాను డిజిటల్ గా విడుదల చేద్దాం అని భావించి ఓ ప్రముఖ ఓటీటీ సంస్థకు ఓకే చెప్పిందంట. కానీ ఇప్పుడు ఆ ఓటీటీ సంస్థ రామ్ సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఓటీటీ లో విడుదలైన పెంగ్విన్, వి సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో వారు ‘రెడ్’ సినిమాకు నో చెప్పారని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న కరోనా కారణంగా సినిమా థియేటర్స్ అన్ని మూతపడ్డాయి. దాంతో విడుదల కావాల్సిన సినిమాలు అన్ని ఓటీటీ దారిలో పడ్డాయి.

Related posts