telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేంద్రమంత్రి నిర్మలమ్మను కలిసిన టీడీపీ ఎంపీలు…

TDP-flag

విశాఖ ఉక్కు పోరాటం భావోద్వేగాల సమస్యగా మారుతోంది. కార్మిక ఉద్యమం అన్ని వర్గాలను కదిలిస్తోంది. వరుసగా ఐదో రోజు నిరసనలు హోరెత్తాయి. కేంద్రం వైఖరికి నిరసనగా మహిళలు, నిర్వాసిత గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు.  ఇది ఇలా ఉండగా.. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ ను టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల, కేశినేని నాని కలిశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పునఃపరిశీలించాలని టీడీపీ ఎంపీల బృందం వినతిపత్రం అందించింది. “విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు” అనే నినాదంతో సుదీర్ఘ పోరాటం తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందని కేంద్ర ఆర్ధికమంత్రికి వివరించింది టిడిపి ఎంపీల బృందం. ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా విశాఖ ఉక్కు నిలిచిందని గుర్తుచేసారు టీడీపీ ఎంపీలు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రత్యేక గనులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కును ఆదుకునేందుకు గతంలో వాజ్పేయి చూపిన చొరవను ప్రస్తుత ప్రభుత్వం చూపాలని విన్నవించారు టీడీపీ ఎంపీలు.

Related posts