telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

భారత స్వాత్రోద్యమం…

Indian flag

మూడు రంగుల జెండాతో
నీ లాకాశం ముచ్చటగా మెరుస్తుంది

ఈ నేల కోసం.. జాతి కోసం

ప్రాణాలర్పించిన త్యాగధనుల

బలిదానాన్ని రెపరెపలాడుతూ జ్ఞాపకం చేస్తుంది..

మనమంతా ఒక్కటే అని

ఎలుగెత్తి చాటుతున్నది

శాంతి,అహింస,సామరస్య లకు చిహ్నంగా

భవ్యంగా వెలుగులు విరజిమ్ముతుంది

నింగి,నేల సౌభ్రాతృత్వాన్ని చాటుతూ

ఆకాశం నిండా వెలుగుతుంది…

భారత స్వాత్రోద్యమం

ఎందరో వీరుల

శరీరం నుండి చిమ్మిన రక్తం

నేలను తాకింది…

గుండెల్లో ఆవేశంతో

కన్నులు ఇరుపేక్కాయ్..

స్వామి వివేకానంద,

సాంఘిక గౌరవ భోధన లు

రవీంద్రనాథ్ ఠాగూర్

స్వేచ్ఛ పట్ల కృషి భోధన లు

సుభాష్ చంద్రబోస్

సాయుధ సంగ్రామం

భగత్ సింగ్ వీరత్వం

గాంధీజీ శాంతి స్వాత్రోద్యమం

ఎందరో వీరులు, వీరనారి మణులు

ఉద్యమ పోరాటం

ప్రజల అసమాన్య పోరాటం

ఫలితంమే

బ్రిటీష్ పాలనకు చరమ గీతం

వందేమాతరం గీతం

జన గణ మన తో

జెండా గర్వం గా ఆకాశాన్ని తాకింది..

 

Related posts