telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

స్కూల్స్ ఓపెన్ సరైన నిర్ణయం కాదు : భట్టి

జులై 1 నుంచి స్కూల్స్ ఓపెన్ చేస్తామనడం సరికాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తప్పుబట్టారు. ఒకవేళ అలా చేయాలంటే జులై 1 లోపు పిల్లలకు టీకా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పిల్లలకు టీకా పూర్తయ్యాక స్కూల్స్ ఓపెన్ చేయాలన్నారు. పిల్లలకు టీకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం చేయలేకపోయాయని విమర్శించారు. కరోనా థర్డ్ వేవ్ బారిన పిల్లలు పడకుండా ప్రభుత్వం ఏం జాగ్రత్తలు తీసుకుందని, ఏ జాగ్రత్తలు లేకుండా ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అంటే ఎలా? అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. 

Related posts