టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్‌కు కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని, కరోనా పాజిటివ్ రావడంతో సాయి ధరమ్ తేజ్ సెల్ఫ్ అసోలేషన్‌లోకి వెళ్లిపోయారని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. తేజూ హీరోగా వస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటరు’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొంత ఆలస్యం జరిగింది. దీంతో తేజ్‌కు కరోనా సోకడం వల్లే డబ్బింగ్ పనులు వాయిదా వేశారని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ పుకార్లన్నింటికీ సాయి తేజ్ ఒకేఒక్క ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టారు. ఈ రూమర్లు మొదలైన కొద్దిసేపటికే తేజూ స్పందించారు. దర్శకుడు దేవా కట్టతో చేయబోయే తన తరవాత సినిమాకు సంబంధించి ఒక వర్కింగ్ స్టిల్‌ను తేజూ ట్వీట్ చేశారు. “#SD14 కోసం ప్రిపరేషన్ ప్రారంభమైంది. దేవా కట్ట గారు తన రచనతో రక్తి కట్టిస్తున్నారు. సెట్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాం” అని తేజూ తన ట్వీట్‌లో పేర్కొ్న్నారు. అంతేకాదు తాను ఫిట్‌గా ఉన్నట్టు తెలియజేడానికి బైసెప్స్ ఎమోజీని కూడా పెట్టారు. ఇదిలా ఉంటే, ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో తేజూ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న తేజ్ ఇప్పుడు దేవా కట్ట దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది సాయి ధరమ్ తేజ్ కి 14వ సినిమా. ఈ సినిమాలో తేజ్ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.
Intense Prep work started for #SDT14 @devakatta garu nailing it with his writing…raring to go on set 💪🏼💪🏼💪🏼 pic.twitter.com/930VgwawnP
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 6, 2020
నయనతారకు ఎందుకు సారీ చెప్పాలి ? : రాధారవి