telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

లక్షల ఉద్యోగాలని యువత చెవిలో పూలు పెట్టారు

Devineni-uma

 ఏపీలో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కొడాలి నాని అసత్యపు లెక్కలు చెబుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. సీఎం జగన్ కళ్లలో ఆనందం కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూ.5,308 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. కేవలం రూ.1,637 కోట్లు ఇచ్చి, అంతా ఇచ్చినట్లు చెబుతున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులపై శ్వేత పత్రం విడుదల చేయాలని దేవినేని డిమాండ్ చేశారు. దళారులు, వ్యాపారులు కుమ్మక్కై వ్యాపారులను దోచేసుకుంటున్నారని చెప్పారు. ఉద్యోగ విప్లవం పేరుతో ప్రజల సొమ్ముతో ఫేక్ ప్రచారం సాగిస్తున్నారని ‘‘ఉద్యోగ విప్లవం అంటూ ప్రజల సొమ్ముతో ఫేక్ ప్రచారం. గ్రూపు 1,2 ఖాళీలు 36, పోలీస్ కొలువులు 450 అంట డీఎస్సీ ఊసే లేదు. కనీవినీ ఎరుగనిరీతిలో అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేశారు. ఆశలన్నీ అడియాశలే. పాదయాత్రలో లక్షల ఉద్యోగాలని యువత చెవిలో పూలు పెట్టి, నేడు జాబులు లేని క్యాలెండర్ ఇవ్వడమేంటి? వైఎస్ జగన్’’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

Related posts