telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వినయ విధేయ రామ” సెన్సార్ టాక్

New year wishes

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “వినయ విధేయ రామ”. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ ని కేటీఆర్, చిరంజీవి కలసి విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. జనవరి 11న సంక్రాంతి కానుకగా “వినయ విధేయ రామ” చిత్రం పేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా ముగించుకుంది ఈ చిత్రం. సెన్సార్ బోర్డు “వినయ విధేయ రామ” చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బోయపాటి మార్క్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయనేది టాక్. సినిమా తప్పకుండా మాస్ అభిమానులను మెప్పిస్తుందని, అలాగే ఫ్యామిలీతో కలిసి సినిమాను చూడొచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా సినిమా ద్వితీయార్థంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయట. మరి సంక్రాంతికి బరిలోకి దిగబోతున్న ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

Related posts