telugu navyamedia
రాజకీయ వార్తలు

జమ్ముకశ్మీర్‌ లో రాష్ట్రపతి పాలన పొడగింపు

jammu and kashmir state

జమ్ముకశ్మీర్‌లో గతేడాది డిసెంబరు నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ బుదవారం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం జూలై మూడు నుంచిజమ్ముకశ్మీర్‌లో అమల్లోకి వస్తుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో అంతకుముందు పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చాక కొన్నాళ్లు గవర్నర్ పాలన కొనసాగింది. అనంతరం రాష్ట్రపతి పాలన విధించారు.

ఈ ఏడాది చివర్లో జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అమర్‌నాథ్ యాత్ర ముగిశాక ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. జూలై నెలలో న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రానున్నారు. కొన్ని రోజులపాటు ఈ జాతర అట్టహాసంగా జరుగుతుంది. ఈ జాతర ముగిసిన అనంతరం ఈసీ ఎన్నికల షెడ్యూలు విడుదల చేసే అవకాశముంది.

Related posts