ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ విజేతగా నిలవడంతో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ట్రెవర్ బేలిస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్విటర్ వేదికగా స్పష్టం చేసింది. అంతేకాకుండా ఏడు సీజన్ల పాటు సన్‌రైజర్స్‌కు సేవలందించిన టామ్ మూడీకి ధన్యవాదాలు తెలిపింది. ఆస్ట్రేలియాకు చెందిన ట్రెవర్ బేలిస్ శిక్షణలో ఇంగ్లండ్ తొలిసారి ప్రపంచకప్ విజేతగా నిలవడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు అతడి కోసం పోటీపడ్డాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా బేలిస్ కోసం చివరి వరకు ప్రయత్నించింది.
ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్‌లో తమ జట్టుకు కోచ్‌గా సేవలందించేందుకు బేలిస్‌కు సన్‌రైజర్స్ భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఐపీఎల్‌లో రెండు సార్లు విజేతగా నిలిచినప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కోచ్‌గా బేలిస్ ఉన్నాడు. అంతేకాకుండా సిడ్నీ సిక్సర్స్ బిగ్‌బాష్ లీగ్ గెలవడంలో కోచ్‌గా బేలిస్ పాత్ర మరవలేనిది. తాజాగా ఇంగ్లండ్ తొలిసారి ప్రపంచకప్ గెలవడంతో అందరి దృష్టి ట్రెవర్ బేలిస్ పై పడింది.
తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి: ఎర్రబెల్లి