telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాజకీయ ప్రకటనలు నిలిపివేస్తూ గూగుల్ నిర్ణయం…

google logo

గూగుల్‌ ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చింది గూగుల్‌. ఇక మీదట రాజకీయ ప్రకటనలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. నిన్నటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అమెరికాలోని క్యాపిటల్ భవనంపై దాడితో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్‌ విధించిన ఈ నిషేధం జనవరి 21వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ చేపట్టనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కూడా గూగుల్ రాజకీయ ప్రకటనల విషయంలో పాక్షిక బ్యాన్ విధించింది. అయితే, ఎన్నికలు ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత మళ్లీ ప్రకటనలకు అనుమతి ఇచ్చింది. మొత్తంగా ఓ వారం రోజులపాటు రాజకీయ ప్రకటనలకు అవకాశం లేదని చెప్పాలి.. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఈ నెల 20వ తేదీన బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మళ్లీ నిర్ణయం తీసుకోనుంది గూగుల్. అయితే ఈ నిర్ణయం రాజకీయ పార్టీలకు చాలా నష్టం చేస్తుంది అనేది తెలిసిందే. మరి ఈ నిర్ణయం పై వారు ఏమైనా స్పందిస్తారా… లేదా అనేది చూడాలి.

Related posts