telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మొక్క ఆధారిత మాంసం ఉత్పత్తుల వ్యాపారంలో జెనీలియా దంపతులు

Genelia

తెలుగు ప్రేక్షకులకు “బొమ్మరిల్లు”తో బాగా దగ్గరైన బ్యూటీ జెనీలియా 2012 ఫిబ్రవరి 3న‌ రితీష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత ఈ జంటకు 2014 లో రియాన్ అనే మగ బిడ్డ జన్మించారు. ఈ మాజీ హీరోయిన్ జెనీలియా కూడా సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉందట. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌కు భార్యగా మారిన తర్వాత జెనీలియా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ బాలీవుడ్ స్టార్ కపుల్ ఇప్పుడు మొక్క ఆధారిత మాంసం ఉత్పత్తుల బిజినెస్‌లోకి అడుగెట్టబోతున్నారు. జెనీలియా అండ్ రితేష్ దేశ్‌ముఖ్. వీరిద్దరూ కలిసి ఇప్పుడు భారత్ ప్రజలకు ‘ఇమేజిన్ మీట్స్’ ద్వారా మొక్కల ద్వారా తయారైన మాంసం ఉత్పత్తులను అందించనున్నారు. ఇవి మొక్కలతో తయారైనప్పటికీ వాసన, రుచి మాత్రం నిజమైన మాంసంలానే ఉంటాయట. జెనిలీయా, రితేష్‌లు ఈ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. జెనీలియా మరియు రితేష్ దేశ్‌ముఖ్‌లు దాదాపు నాలుగు సంవత్సరాలు నుంచి నాన్‌వెజ్‌కు స్వస్తి పలికారు. శాకాహారులుగా మారారు. ఇకపై శాకాహారులుగానే ఉండాలనే నిర్ణయం వారు అప్పటిలో తీసుకున్నారు. దీంతో వారు ఆ మధ్య అమెరికాలో మొక్కలతో మాంసాహార పదార్థాలు తయారు చేయవచ్చనే విషయం తెలుసుకుని.. అప్పటి నుంచి వాటినే వారు స్వీకరిస్తున్నారట. ఎంతో రుచికరంగానూ, ఆరోగ్యకరమైనవి కూడా కావడంతో ఇప్పుడు అమెరికాకు చెందిన గ్లోబల్ సంస్థ ఆర్చర్ డేనియల్స్ మిడ్‌ల్యాండ్ గుడ్ పుడ్స్‌ ఇనిస్టిట్యూట్‌తో కలిసి జెనీలియా, రితేష్‌లు భారత్‌లో ఈ వ్యాపారం ప్రారంభించబోతోన్నట్లుగా తెలిపారు. త్వరలోనే ‘ఇమేజిన్ మీట్స్’ ద్వారా బిర్యానీ, కబాబ్ ఇంకా కూరల వంటి ఎన్నో ఉత్పత్తులను భారత ప్రజలకు అందించనున్నామని రితేష్ దంపతులు తెలిపారు.

Related posts