telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వీసా విధానంపై యూఎస్ లో చాంబర్ ఆఫ్ కామర్స్ కేసు

Hib visa us

వీసా విధానంపై అమెరికా ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో చాంబర్ ఆఫ్ కామర్స్ సహా పలు వ్యాపార సంఘాలు కేసు వేశాయి. అధ్యక్షుడు ట్రంప్ తో పాటు డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీపైనా ఈ కేసు దాఖలైంది. ట్రంప్ తన అధికార పరిధులను దాటి ఈ ఉత్తర్వులను తీసుకుని వచ్చారని తమ పిటిషన్ లో ఆరోపించారు.

యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మాన్యుఫాక్చరర్స్, ది నేషనల్ రిటైల్ ఫెడరేషన్ తదితర వ్యాపార సంఘాలు ఈ పిటిషన్ లో భాగమయ్యాయి. ట్రంప్ నిర్ణయాలు చట్ట విరుద్ధమైనవని, ఇవి స్వాగతించదగినవి కాదని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగేందుకు అవసరమైన ఇంజనీర్లు, ఐటీ నిపుణులు, డాక్టర్లు, నర్సులు, వ్యక్తుల రాకను అడ్డగిస్తుందని వారు ఆరోపించారు. ట్రంప్, తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ థామస్ డొనోహూ డిమాండ్ చేశారు.

Related posts