telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నాయిని అల్లుడు ఇంట్లో ఈడీ సోదాలు…

గత 24 గంటలుగా దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది.  24 గంటల పాటు ఈ సోదాలు చేసిన ఈడీ విలువైన వస్తువులు,డాకుమెంట్స్, నగదును స్వాధీనం చేసుకుంది.  నగదుతో పాటుగా పెద్ద ఎత్తున బ్లాంక్ చెక్ లను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది.  ఈఎస్ఐ స్కామ్ లో శ్రీనివాస్ రెడ్డి, ముకుంద్ రెడ్డిలది కీలక పాత్ర అని ఈడీ గుర్తించింది.  ముకుంద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు కలిసి మెడికల్ వైద్య పరికరాలను కొనుగోళ్లు చేయడంలో కీలక పాత్ర పోషించారని ఈడీ గుర్తించింది.  నిన్నటి నుంచి ఏడుగురి ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇప్పటి వరకు మూడు కోట్ల పై చిలుకు నగదుతో పాటుగా కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు, ఆభరణాలు, ఆస్తుల పాత్రలను ఈడీ స్వాధీనం చేసుకుంది.  రూ.200 కోట్ల రూపాయల ఈఎస్ఐ స్కామ్ లో మనీలాండరింగ్ హవాలా జరిగినట్టు అధికారులు గుర్తించారు.

Related posts