కరోనా కారణంగా 2020 లో లాక్ డౌన్ విధించిన సమయంలో ఎంతో మందికి సహాయం చేయి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. అయితే ఇప్పుడు దేశంలో మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. అయితే కరోనా విజృంభిస్తున్న కారణంగా పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ఆన్లైన్ తరగతులను ప్రారంభించాయి. అయితే చాలా మంది గ్రామీణ విద్యార్థులు ఇంటర్ నెట్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. కాగా, రీసెంట్‌గా నాగ్‌పూర్ కు సమీపంలోని గొడియా జిల్లాలో ఓ గ్రామ ప్రజలు ఇంటర్‌నెట్ సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎం చేయాలో తెలియక, ఈ విషయాన్ని ఓ నెటిజన్ తన ట్విట్టర్ ద్వారా నటుడు సోనూసూద్‌కు చేరవేశాడు. ఆ ట్వీట్ పై స్పందించిన సోనూసూద్.. ఆ గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడమే ఆలస్యం.. వెంటనే ఆయన ఆ గ్రామంలో మొబైల్ టవర్ ఏర్పాటు చేయించి వారి మనసులని గెలుచుకున్నారు. అతి తక్కువ టైం వ్యవధిలోనే సెల్ టవర్ ఏర్పాటు పూర్తి చేయించారు. ఆ తర్వాత వీడియో కాల్ ద్వారా ఆ గ్రామస్థులతో సోనూ మాట్లాడారు. అయిత్ ఏప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
previous post
next post
కేంద్రం చెబుతున్నా వైసీపీ ప్రభుత్వానికి అర్థం కాలేదు: చంద్రబాబు