యంగ్ హీరో రాజ్ తరుణ్ గుండె జారి గల్లంతయిందే, ఒక లైలా కోసం వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి ప్రశంసలు అందుకున్న విజయ్ కుమార్ కొండతో సినిమా చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి “ఒరేయ్ బుజ్జిగా” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తాజాగా ప్రకటించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఐదేళ్ల తర్వాత విజయ్ కుమార్ కొండ మళ్ళీ సినిమా చేయనుండడంతో ఈ సినిమాపై చాలా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ “ఇద్దరి లోకం ఒకటే” అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో షాలిని పాండే కథానాయికగా నటిస్తుంది. అతి త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. కాగా… కొద్ది రోజుల క్రితం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ టౌన్‌షిప్‌కి వంద అడుగుల రహదారి మలుపువద్ద ఉన్న గోడని రాజ్ తరుణ్ తన కారుతో గుద్ది వార్తలలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ వివాదం మరింత ముదురుతున్న క్రమంలో రాజ్ తరుణ్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చి వివాదానికి చెక్ పెట్టాడు.