telugu navyamedia
రాజకీయ వార్తలు

బాల్‌ థాకరేకు ఇచ్చిన మాటను అమలు చేయాలి: ఉద్ధవ్ థాకరే

uddhav-thackeray-shivasena

మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గతేడాది నవంబరులో ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం పదవిని స్వీకరించడానికి గల కారణాలపై ఉద్ధవ్ థాకరే తమ పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ పదవి ఏదైనా సరే స్వీకరించకూడదన్న థాకరే కుటుంబ సంప్రదాయాన్ని మేము పక్కనపెట్టాం. అయితే, బాల్‌ థాకరేకు ఇచ్చిన మాటను అమలు చేయాలంటే సీఎం పదవిని స్వీకరించకతప్పదు. అందుకే నేను ఈ పదవిని స్వీకరించాను’ అని తెలిపారు.నా తండ్రికి ఇచ్చిన ఓ మాటను అమలు చేసే క్రమంలో ఇది ఓ అడుగు మాత్రమేనని స్పష్టం చేశారు.

Related posts