telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

రైల్వే భోజనం మరింత ప్రియం.. కొత్త రేట్ల వివరాలు ఇవే!

Railway food train

రైల్వే స్టేషన్లలో భోజనం మరింత ప్రియం కానుంది. స్టేషన్లలోని ఆహార పదార్ధాల ధరలను సవరించినట్లు ఐఆర్‌సీటీసీ పేర్కొంది. తాము ప్రామాణిక ధరలను మార్చామని, జనాహార్, రిఫ్రెష్ మెంట్ రూమ్స్ వంటి వాటికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. ధరల పెంపు ద్వారా ఆహారం నాణ్యత పెరుగుతుందని, శుభ్రత, నాణ్యతపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తామని వెల్లడించింది. ఈ ధరలన్నీ జీఎస్టీతో కలిసి గణించినట్టు తెలిపింది.గత నెలలోనే శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లలో కేటరింగ్ సర్వీస్ చార్జీలను ఐఆర్‌సీటీసీ పెంచింది. తాజా పెంపుతో కొత్త రేట్లు అమలు కానున్నాయి.

కొత్త ధరల ప్రకారం.. వెజ్ బ్రేక్‌ఫాస్ట్- రూ.35, నాన్‌వెజ్ బ్రేక్‌ఫాస్ట్- రూ.45, వెజ్ మీల్- రూ.70, ఎగ్ కర్రీ మీల్- రూ.80, చికెన్ కర్రీ మీల్- రూ.120, వెజ్ బిర్యానీ(350 గ్రామ్స్)- రూ.70, ఎగ్ బిర్యానీ(350 గ్రామ్స్)- రూ.80, చికెన్ బిర్యానీ(350 గ్రామ్స్)- రూ.100, స్నాక్ మీల్(350 గ్రామ్స్)- రూ.50 గా ఉంటుందని ఐఆర్సీటీసీ వెల్లడించింది.

Related posts