telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

తమిళనాడు : .. ప్రభుత్వ తాయిలం.. పండుగ సందర్భంగా .. చీరె, పంచె.. నగదు..

tamilanadu scheme on festival

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఒక కొత్త పథకాన్ని అమలులోకి తెచ్చింది. రేషన్ కార్డ్ ఉన్న కుటుంబాలకు ఒక పంచె, ఒక చీర, 1000 రూపాయలు, ఇతర సామాగ్రి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇందుకోసం బడ్జెట్ కూడా కేటాయించింది. కానీ ఈ ఆఫర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం కాదు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 1000 రూపాయలు, చీర, పంచెతో పాటు సామాగ్రిని ప్రభుత్వం అందించనుంది. మూడు రోజుల క్రితం దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం ఆమోదించింది. సీఎం పళనిస్వామి విపరీతమైన కరువు వలన గత సంవత్సరం తమిళనాడు రాష్ట్రం అల్లాడిపోయిందని తమిళనాడు రాష్ట్ర ప్రజల యొక్క బాధలను తగ్గించటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయని రైతులు వారి దగ్గర ఉన్న డబ్బులను వ్యవసాయ, ఇతర ఖర్చుల కోసం ఉపయోగించారని పళనిస్వామి చెప్పారు.

రేషన్ దుకాణాల ద్వారా ఈ నగదు, సామాగ్రిని ప్రజలకు ఇవ్వనున్నారు. ప్రభుత్వం 2,363 కోట్ల రూపాయలను సంక్రాంతి పండుగ కానుక కోసం ఖర్చు చేయనుంది. ప్రభుత్వం సామాగ్రిలో భాగంగా కిలో చక్కెర, కిలో బియ్యం, 20 గ్రాముల ఎండు ద్రాక్ష, 20 గ్రాముల జీడిపప్పు, 5 గ్రాముల యాలకులు, 2 అడుగుల చెరుకు గడ ఇవ్వనుంది. తమిళనాడు రాష్ట్రంలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. నాలుగు రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. మొదటి రోజును భోగి పొంగల్, రెండవ రోజును థాయ్ పొంగల్, మూడవ రోజును మట్టు పొంగల్, నాలుగవ రోజును కనుమ పొంగల్ అని పిలుస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో పరుగెత్తే ఎద్దులను అదుపు చేయటానికి యువకులు పోటీ పడతారు. పండుగ రోజున పొంగల్ అనే ప్రత్యేక వంటకాన్ని చేతికందిన పంట నుండి సేకరించిన బియ్యాన్ని ఉడికించి తయారు చేస్తారు.

Related posts