telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పాదచారుల భద్రత కోసం నగరంలో పెలికాన్ సిగ్నల్స్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలి – రోనాల్డ్ రోస్

పాదచారుల భద్రత కోసం నగరంలో పెలికాన్ సిగ్నల్స్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. సిగ్నల్ వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు మంగళవారం ఈ.ఎన్.సి, పోలీస్, ఎలక్ట్రిసిటీ అధికారులతో కలిసి సమీక్షించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… జిహెచ్ఎంసి, పోలీస్ శాఖ సమన్వయంతో నగరంలో ఎ.టి.ఎస్.సి, పెలికాన్ సిగ్నల్స్ మొత్తం 404 ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. అందులో 169 పాత సిగ్నల్స్ 113 కొత్త ఏ టి ఎస్ సి సిస్టమ్ ద్వారా మొత్తం 282 సిగ్నల్స్ ఏర్పాటు చేసినట్లు పాదచారుల భద్రత కోసం 78 పెలికాన్ సిగ్నల్ ఏర్పాటు చేసినట్లు, పెరిగిన ట్రాఫిక్ సమస్య వలన పాదచారులకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పెలికాన్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని పోలీస్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ను ఆదేశించారు. నగరంలో ఏర్పాటు చేసిన 404 సిగ్నల్స్ ను 57 కారిడార్లు లో ఏర్పాటు చేశారు. నాన్ కారిడార్ లో గల 44 సిగ్నల్స్ ను ఆధునీకరించి కమాండ్ కంట్రోల్ అనుసంధానం చేయాలని ఆదేశించారు.

ట్రాఫిక్ నియంత్రణకు ఎ.టి.ఎస్.సి సిగ్నల్ వ్యవస్థ మరెక్కడా లేదని, తద్వారా నగరంలో ఎ.టి.ఎస్.సి సిగ్నల్ ద్వారా 20 నుండి 30 శాతం ప్రయాణ సమయం ఆదా అవుతుంది అని పోలీస్ అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ సుధీర్ బాబు వివరించారు.

ఈ సమావేశంలో ఇ ఎన్ సి జియా ఉద్దీన్, ఎలక్ట్రిసిటీ ఎస్.సి శ్రీనివాస్, ఈ ఈ మమత, ట్రాఫిక్ సిగ్నల్ నిర్వహిస్తున్న ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

—————————————

– సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది.

Related posts