telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బంజారాహిల్స్ వార్డులో షాది ముబారక్ చెక్ లను పంపిణీ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

నిరుపేద కుటుంబాల ఆడపిల్లల పెండ్లి సందర్భంగా తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్నదని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం బంజారా హిల్స్ వార్డులో షాది ముబారక్ పథకం కింద మంజూరైన లబ్ధిదారులకు తన క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… సకల జనులకు కనీస జీవన భద్రత కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం అని, నిరుపేదలు ఆర్థికంగా, సామాజిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నిరుపేదల కుటుంబాలకు చెందిన ఆడపిల్ల పెళ్ళికి కల్యాణలక్ష్మి ద్వారా ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా ముస్లిం మైనారిటీ నిరుపేదల సంక్షేమం కోసం ఒక లక్ష 16 రూపాయలు షాది ముబారక్ ద్వారా అందజేయడం జరుగుతుందని మేయర్ అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. ఈ సందర్భంగా బంజారా హిల్స్ వార్డు కు సంబంధించిన 60 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి ఒక లక్ష 16 రూపాయలు మొత్తం 60 లక్షల రూపాయలు పంపిణీ చేశారు.

Related posts