telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత యువ ఆటగాళ్లను ప్రశంసించిన పాక్ క్రికెటర్

భారత జట్టులో యువ ఆటగాళ్లకు కొదువ లేదని, రోజుకో ఆటగాడు అరంగేట్రం చేస్తూ.. ఫస్ట్ మ్యాచ్‌లోనే సత్తా చాటుతున్నారని పాకిస్థాన్ మాజీ క్రికెటర్, కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ కొనియాడాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేతో అరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా, ప్రసిధ్ కృష్ణలను ఉద్దేశించి ఇంజమామ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఈ ఇద్దరిని ప్రశంసించాడు. అలాగే ‘ఫార్మాట్‌కు తగ్గట్లు యువ ఆటగాళ్లను సిద్దం చేసేందుకు టీమిండియా దగ్గర ఏమైనా యంత్రం ఉన్నట్లుంది. రోజుకో ఆటగాడు జట్టులోకి వచ్చి అదరగొడుతున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లోనూ ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ఒకరు బ్యాటింగ్‌‌లో చెలరేగితే.. మరొకరు బౌలింగ్‌లో విజృంభించారు. గత 6 నెలలుగా చూసుకుంటే.. ఆసీస్‌ సిరీస్‌ నుంచి మొదలుకొని జట్టులోని యువ ఆటగాళ్లంతా అదరగొట్టేస్తున్నారు. సీనియర్స్‌ వాళ్ల పాత్ర పోషిస్తుండగా.. జూనియర్లు మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రెచ్చిపోతున్నారు అని ఇంజమామ్ పేర్కొన్నాడు.

Related posts