telugu navyamedia
వార్తలు

జగనన్న కాలనీల నిర్మాణంపైనా సీఎం జగన్ సమీక్ష…

cm jagan

జగనన్న కాలనీలలో వసతుల కల్పన, టిడ్కో ఇళ్ల నిర్మాణంపైనా సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ అనంతరం మాట్లాడుతూ… జగనన్న కాలనీలలో జూన్‌ 1న పనులు ప్రారంభం. ఈనెల 25 నాటికి ఆ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలి. కర్ఫ్యూ సమయంలోనూ ఈ పనులేవీ ఆగకూడదు. మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిథిగా కార్యకలాపాలు నిర్వహించండి. నీటి సదుపాయాలు, విద్యుత్‌ సరఫరా వ్యవస్థ ఉండాలి. ఇళ్ల నిర్మాణం పనుల్లో ఎక్కడా జాప్యం ఉండకూడదు. కోవిడ్‌ సమయంలో ఇళ్ల నిర్మాణం ఆర్థిక వ్యవస్థకు వృద్ధి జరుగుతుంది. కార్మికులకు పని దొరుకుతుంది. స్టీల్, సిమెంట్‌..ఇతర మెటేరియల్‌ కొనుగోలుతో వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. ఇళ్ల నిర్మాణంలో లెవెలింగ్‌ అన్నది చాలా ముఖ్యం. భవిష్యత్తులో అంతా భూగర్భ కేబుల్‌ వ్యవస్థనే. నీటి పైప్‌లు, విద్యుత్, ఇంటర్నెట్‌ కేబుళ్లన్నీ భూగర్భంలోనే డీపీఆర్‌ సిద్దం చేయండి అని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Related posts