telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

గ్రూప్-4 మెరిట్ లిస్ట్ .. విడుదల ..

group-4 merit list released

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 సహా వివిధ పోస్టుల మెరిట్ జాబితాలను విడుదల చేసింది. గ్రూప్-4 మెరిట్‌లిస్టులో 2,72,132 మంది, టీఎస్‌ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ల కొలువులకు 33,132 మంది, జీహెచ్‌ఎంసీ బిల్ కలెక్టర్ పోస్టులకు 69,378 మంది, బేవరేజ్ కార్పొరేషన్‌లోని వివిధ ఉద్యోగాలకు 19,545 మంది అర్హత సాధించినట్టు, ఈ వివరాలు కమిషన్ వెబ్‌సైట్‌లో ఉన్నట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొన్నది.

తెలంగాణ గురుకులాల్లోని డిగ్రీ లెక్చరర్(పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్) ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. న్యాయస్థానం తీర్పును అనుసరించి వెల్లడించిన ఈ జాబితా కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపింది.

Related posts