telugu navyamedia
ఆంధ్ర వార్తలు విద్యా వార్తలు

ఏపీ: పదో తరగతి పరీక్షలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ లో పదో తరగతి పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సరేష్ రిలీజ్‌ చేశారు. విద్యార్థులు http://www.bse.ap.gov.in/ వెబ్ సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఏడాదితో పాటు గతేడాది(2020) ఫలితాలను సైతం మంత్రి విడుదల చేశారు.

కరోనా కారణంగా ఏపీ పదో తరగతి పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. అయితే గతేడాది అందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించిన ప్రభుత్వం మార్కులు కేటాయించలేదు. కేవలం పాసైనట్లు వెల్లడించింది. అయితే ఈ సారి వారికి కూడా మార్కులు కేటాయించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… టెన్త్ మార్కులు అనేక పోటీ పరీక్షల్లో విద్యార్థులకు ముఖ్యం అని మంత్రి అన్నారు. ప్రతిభను ప్రధానంగా తీసుకుని ఎవరికి నష్టం రాకుండా  ఫలితాలను ప్రకటించామన్నారు.

Related posts