బంగ్లాదేశ్ స్టార్ హీరోయిన్ డ్రగ్స్ రాకెట్ కలకలం సృష్టిస్తోంది. పోరీ మోనీ ఇంట్లో నాలుగు గంటలపాటు సోదాలు జరపగా భారీగా డ్రగ్స్, విదేశీ మద్యం పట్టుబడడంతో రాపిడ్ యాక్షన్ బెటాలియన్ అదుపులోకి తీసుకుంది. గురువారం ఆమెను కోర్టులో
కాగా..చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుండి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన హీరోయిన్ కావడంతో ఈ వార్త ఆ దేశంలో సంచలంగా మారింది. అంతేకాదు.. ఇది తనపై కక్ష్యపూరితంగా చేసిన పనేనని ఆమె మీడియాకెక్కడంతో ఇది కాస్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
అంతకుముందు..జూన్ 8న ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు నజీర్ ఉద్దీన్ మహమ్మూద్ మీద లైంగిక ఆరోపణలు చేసింది. బోట్ క్లబ్ వద్ద నజీర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే.. నజీర్ మీద ఎలాంటి కేసు నమోదు కాలేదు. తనకున్న పలుకుబడితోనే కేసులు నమోదు కాకుండా మేనేజ్ చేసుకున్నా.. నెటిజన్లు, సిటిజన్ల నుండి పోరీ మోనీకి భారీ మద్దతు లభించింది.
అయితే నిందితుడు బంగ్లాదేశ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ బెనజీర్ అహ్మద్‌కు సన్నిహితుడు కావడంతోనే ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోరి మోనీ పేర్కొంది. ఆ తర్వాత.. పోరీ మనినే తమ క్లబ్‌లో విధ్వంసానికి పాల్పడిందని క్లబ్ నిర్వాహకులు ఆమెపై ఫిర్యాదు చేశారు. అనంతరం రెండు నెలలకు ఆమె డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం సంచలనంగా మారింది.