telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

పీపీఈ కిట్ ధరించి నకిలీ డాక్టర్ మోసాలు

Fake doctor vijayawada

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఓ నకిలీ వైద్యురాలు డబ్బులు దండుకుంటూ మోసాలకు పాల్పడుతోంది. పీపీఈ కిట్ ధరించి మరీ… రోగుల బంధువుల నుంచి డబ్బులు వసూలు చేసింది. కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితి చెబుతానంటూ డబ్బు వసూళ్ళకు పాల్పడింది. వైద్యురాలి వేషంలో కరోనా వార్డుల్లో తిరుగుతూ మొబైల్ ఫోన్లు కొట్టేసింది.

శైలజ (43) అనే మహిళ డాక్టర్ వేషం వేసి కరోనా వార్డుల్లో చోరీలకు తెరలేపింది. కరోనా పేషెంట్ల ఫోన్లు తస్కరించడమే కాదు, వారికి మెరుగైన సేవలు అందిస్తానని చెబుతూ రోగుల బంధువుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసింది. తమ వాళ్ల పరిస్థితి ఏంటో చెప్పండి అంటూ పలువురు ఆమెను ఆశ్రయించగా, వారి పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆమె అనేక మంది నుంచి డబ్బులు వసూలు చేసింది. పీపీఈ కిట్ తో నిత్యం కరోనా వార్డుల్లో తిరుగుతున్న శైలజ గురించి సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి ప్రశ్నించబోగా పారిపోయింది.

తర్వాత కూడా ఆసుపత్రికి రావడంతో ఈసారి మహిళా సిబ్బంది వచ్చి పట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. శైలజను పోలీసులు ప్రశ్నించగా తాను ప్రసాదంపాడులో ఉంటానని, తన భర్త పేరు సత్యనారాయణ అని వెల్లడించింది. ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేశారు.

Related posts