telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలో చౌటకూర్‌ మండలం కేంద్రం సమీపంలోని జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారిని కారు ఢీ కట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. వీరు మెదక్‌ జిల్లా సంగాయి పేట గ్రామానికి చెందిన పద్మ(30), అంబదాస్‌(40), దంపతుల కుమారుడు వివేక్‌(6) అనారోగ్యానికి గురి కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు.

అనంతరం స్వగ్రామానికి తిరిగి వస్తుండగా.. చౌటకూర్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు. మృతదేహలను శవ పరిక్షల నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం జిల్లా ఎస్పీ రమణ కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం తీరును పరిశీలించారు.

Related posts