ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేపై మణిపురి సమీపంలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న సంఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ నుంచి వారణాసివైపు వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు ముందుభాగం తునాతునకలైంది. డ్రైవర్ సహా ఏడుగురు ప్రయాణికులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జగన్ నవరత్నాలు పంచుతాడో లేదో చూస్తా: కేఏ పాల్