telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

జూనియర్ ఆర్టిస్టును వేధించిన యువకుని పై కేసు నమోదు

New couples attack SR Nagar

జూనియర్ ఆర్టిస్టును వేధించిన ఓ యువకుడి పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలో ఉన్న ఓ గ్రామానికి చెందిన గుర్రం దిలీప్ అనే యువకుడు సినిమా షూటింగుల్లో పని చేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతి జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుంది. ఆమె హైదరాబాదులోని ఇందిరానగర్ లోనివాసముంటుంది. ఈనెల 25న ఆమెతో దిలీప్ గొడవకు దిగాడు. అంతేకాదు, చెయ్యి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో, బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దిలీప్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Related posts