telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గోపీచంద్ “సీటిమార్”లో బాలీవుడ్ భామ ఐటమ్ సాంగ్

మాచోహీరో గోపీచంద్ ప్రస్తుతం ‘సీటీమార్’ సినిమా చేస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. గోపీచంద్ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనున్నారు. అలాగే, మహిళా కబడ్డీ జట్టుకు కోచ్‌గా తమన్నా నటిస్తోంది. ‘సీటీమార్’ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశి రౌతెలను రంగంలోకి దించుతున్నారు. బాలీవుడ్‌కు చెందిన చాలా మంది భామలు ఇప్పటికే తెలుగులో ఐటమ్ సాంగ్స్ చేశారు. అయితే ‘సీటీమార్’లో స్పెషల్ సాంగ్‌కు ఒక కొత్త ఫేస్ కావాలని మేకర్స్ భావించారట. లాక్‌డౌన్ పీరియడ్ పూర్తయి, షూటింగ్‌లో ప్రారంభమైతే ఈ పాటను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఈ పాట చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా ఒక భారీ సెట్‌ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ‘సీటీమార్’ 60 శాతం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోయింది. ఇదిలా ఉంటే మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న ఊర్వశి రౌతెల 2015లో మిస్ దివ కిరీటాన్ని దక్కించుకుంది. మిస్ యూనివర్స్ 2015 అందాల పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించింది. 2013లో సన్నీ డియోలో హీరోగా వచ్చిన ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తరవాత ‘సనమ్ రే’, ‘గ్రేట్ గ్రాండ్ మస్తి’, ‘హేట్ స్టోరీ 4’, ‘పాగల్‌పంతి’ సినిమాల్లో ఊర్వశి నటించింది. ప్రస్తుతం హిందీ మూవీ ‘వర్జిన్ భానుప్రియ’లో ఊర్వశి నటిస్తోంది.

Related posts