telugu navyamedia
సినిమా వార్తలు

వైరల్ వీడియో : ప్రభాస్ కు చెంపదెబ్బ… కొట్టింది అభిమానే…!!?

Prabhas

“బాహుబలి” సినిమా తరువాత ప్రభాస్ అభిమానగణం ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. వివరాల్లోకి వెళ్తే… ప్రభాస్ “సాహో” సినిమా షూటింగ్ నిమిత్తం విదేశీ ప్రయాణంలో ఉండగా… ఎయిర్ పోర్టులో అతన్ని చూసిన ఓ అమ్మాయి ప్రభాస్ తో ఫోటో దిగడానికి ప్రయత్నించింది. ప్రభాస్ కూడా కూల్ గానే ఆ అమ్మాయితో ఫోటో దిగాడు. ప్రభాస్ ను చూసిన ఆనందంలో ఆ యువతి ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక అక్కడే ఎగిరి గంతేసి… అకస్మాత్తుగా ప్రభాస్ బుగ్గపై చిన్నగా కొట్టింది. ప్రభాస్ కూడా బుగ్గ నిమురుకుంటూ చిన్నగా నవ్వేశాడు. ఈ విషయానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Related posts