telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఒక్కరోజే అంతమందికి వ్యాక్సిన్ ఇచ్చారో తెలుసా..?

Corona Virus Vaccine

చైనా నుండి వచ్చిన కరోనా మన దేశాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ కు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత నిన్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.  ఉదయం 10:30 గంటల నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.  ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించిన తరువాత వ్యాక్సిన్ ను ఇవ్వడం స్టార్ట్ చేశారు.  తొలిరోజు మూడు లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఆ లక్ష్యాన్ని చేరుకోలేదు.  తొలిరోజున దేశం మొత్తం మీద 1,91,181 టీకాను ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.  దేశంలో మొత్తం 3351 సెంటర్స్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగినట్టు కేంద్రం ప్రకటించింది.  ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న 1,91,181 మందిలో ఒకరిద్దరికి మినహా సైడ్ ఎఫెక్ట్ కనిపించలేదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది.  దేశంలోని 12 రాష్ట్రాల్లో కొవాక్సీన్, 11 రాష్ట్రాల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను అందించారు.  సైనిక ఆసుపత్రుల్లో పనిచేస్తున్న మూడువేలమంది వైద్యులు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్రం ప్రకటించింది. చూడాలి మరి ఆ సంఖ్య ఈరోజు ఇంతకు పెరుగుతుంది అనేది.

Related posts