telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా”కు సెన్సార్ పూర్తి… టాక్ ఏంటంటే ?

Syeraa

తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఆయన నటించిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. సురేందర్‌రెడ్డి దర్శకుడు. అమిత్‌ త్రివేది స్వరకర్త. శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించారు. ఆదివారం హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చిరంజీవి తన 41 ఏళ్ళ కెరీర్‌లో ఒక హిస్టారికల్ క్యారెక్టర్ చేయడం ఇదే మొదటిసారి. అంతేకాదు చిరంజీవి నటించిన ఈ సినిమా ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళం,కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కావడం అనేది కూడా ఫస్ట్ టైమే అని చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేసారు. ఈ సినిమాలో బ్రిటిష్ వాళ్లతో యుద్ద సన్నివేశాల్లో రక్తపాతం ఉండటంతో ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్టు సమాచారం. అంతేకాదు సెన్సార్ టాక్‌ను బట్టి… ఈ సినిమాలో ప్రేక్షకులను ఉద్విగ్నతకు గురిచేసే సన్నివేశాలు చాలా ఉన్నాయట. సురేందర్ రెడ్డి ఆయా సన్నివేశాలను ఎంతో చక్కగా తెరపై చిత్రీకరించనట్టు సమాచారం. మరోవైపు కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కించాడని టాక్. అంతేకాదు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్, నయనతార, విజయ సేతుపతి, జగపతి బాబు, తమన్నా… ఇలా ప్రతి పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉందని చెప్పారు. ఈ సినిమా 2 గంటల 40 నిమిషాలు అటు ఇటూగా ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Related posts