telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సూర్య క్రొత్త చిత్రానికి టైటిల్ ఖరారు

Surya

తమిళ స్టార్ హీరో సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అందుక‌నే ఆయ‌న సినిమాల‌ను తమిళంతో పాటు తెలుగులోనూ స‌మాంత‌రంగా విడుద‌ల చేస్తుంటారు. సూర్య 38వ చిత్రం ‘ఆకాశం నీ హ‌ద్దురా’ త‌ర్వాత త‌న 39వ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌బోతున్నారు. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడెవ‌రో కాదు..హ‌రి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సినిమాలు రూపొందాయి. అందులో సింగం సీక్వెల్స్ భారీ విజ‌యాల‌ను సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆరోసారి వీరిద్ద‌రు క‌లిసి ప‌ని చేయ‌బోతున్నారు. ఏప్రిల్ నుండి సినిమా షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ ఏడాది దీపావ‌ళికి సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌పై జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘అరువా’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ‘అరువా’ అంటే క‌త్తి అని అర్థం.

Related posts