telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బికినీలో అనుష్క శర్మ… కోహ్లీ రియాక్షన్…!

Anushka-Sharma

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటీవల కాలంలో సినిమాలను బాగా తగ్గించింది. షారూక్ ఖాన్‌తో నటించిన “జీరో” తర్వాత ఇప్పటివరకు అనుష్క మరో సినిమాకు ఓకే చెప్పలేదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో వివాహానికి ముందు తన గ్లామరస్ ఫోటోలను, బికినీ ఫోటోలను రెగ్యులర్‌గా సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసేది. కానీ వివాహం తర్వాత అందాల ఆరబోతకు దూరమైంది. ప్రస్తుతం సినిమాలకు కూడా దూరంగా ఉంది. దీంతో అనుష్క సినిమాలకు దూరమవుతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుష్క తాజాగా వెస్టిండీస్‌ బీచ్‌లో దిగిన ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి “సూర్యుడు ముద్దు పెట్టుకుని ఆశీర్వదించాడు” అంటూ బికినీ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోపై చాలా మంది స్పందించారు. కోహ్లీ కూడా ఈ ఫోటోకు కామెంట్‌గా హృదయం, లవ్‌ స్ట్రక్‌ ఎమోజీలను పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భర్త కోహ్లీతో పాటు అనుష్క కూడా ప్రస్తుతం వెస్టిండీస్ టూర్‌లో ఉంది. మరి నిజంగానే అనుష్క సినిమాలకు దూరమవుతోందా అనే విషయంలో కస్పష్టత రావాల్సి ఉంది.

Related posts