telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ హీరోయిన్ పై ఫిర్యాదు… “ఆమె” సమాజానికి కీడు…

Amalapaul

రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం “ఆమె”. తమిళంలో “ఆడై” టైటిల్ తో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను వీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుండగా చరిత చిత్ర, తమ్మారెడ్డి భరద్వాజలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్లో నగ్నంగా కన్పించి అందరికీ షాకిచ్చింది అమలాపాల్. ఇక టీజర్ విషయానికొస్తే ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ వీక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రముఖులు సైతం సినిమా టీజర్ పై ప్రశంసలు కురిపించారు. టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఇటీవలే ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో అమలాపాల్ మందు తాగుతూ, సిగరెట్ కాలుస్తూ లిప్ లాక్ చేస్తూ చాలా బోల్డ్ గా కనిపించింది. సినిమాల్లో లిప్ లాక్స్ కామనే అయినప్పటికీ అమలాపాల్ తన సహనటి వీజే రమ్యని ముద్దుపెట్టుకోవడం చర్చకు దారి తీసింది. ట్రైలర్ లో ఈ సన్నివేశాన్ని పట్టిపట్టి చూస్తే కాని కనిపించదు. అయితే సినిమా చూశాక అన్నీ అర్థం అవుతాయని, తాను స్క్రిప్టు డిమాండ్ చేయడం వల్లే నగ్నంగా నటించానని చెప్పిందీ భామ. కానీ అమలాపాల్ నటించిన “ఆమె” సినిమాలో నగ్న దృశ్యాలు, ఆ సినిమా పోస్టర్లు సమాజానికి కీడు చేసేవిగా ఉన్నాయని, కాబట్టి వాటిపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నైకి చెందిన రాజేశ్వరి ప్రియ అనే మహిళ బుధవారం చెన్నైలోని డీజీపీ ఆఫీస్ లో ఫిర్యాదు చేసింది. సినిమాపై తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే తాము ఆందోళనకు దిగుతామని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొంది. అయినప్పటికీ సినిమాపై వివాదం చెలరేగుతుండడం గమనార్హం. కాగా ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తెలుగు, త‌మిళంలో ఈ సినిమాను జూలై 19న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related posts