telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేంద్రం..రాష్ట్రం రెండు తోడు దొంగలే…

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టీఆర్‌ఎస్‌, బీజేపీలపై ఫైర్‌ అయ్యారు. కేంద్రం..రాష్ట్రం రెండు తోడు దొంగలు అయ్యాయని.. పసుపు బోర్డుపై ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారన్నారు. ఇద్దరి మధ్య పసుపు రైతులు నష్టపోతున్నారని… పేపర్లు చూస్తుంటే రోజుకొకరు ముఖ్యమంత్రి ఐతున్నారని ఎద్దేవా చేశారు. తాను సీఎంనేనా అనే అనుమానంలో కేసీఆర్‌ ఉన్నాడని… సీఎం గా ఉన్నానని అనుకుని… ఏదో పేపర్ల ఉండాలని రివ్యూ లు చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలతో మద్దతు ధరకు రక్షణ లేకుండా పోతుందని… వ్యవసాయ చట్టాలు వ్యతిరేకించిన కేసీఆర్..మోడీ దగ్గర పొర్లుదండాలు పెట్టారని మండిపడ్డారు. మోడీ దగ్గర విశ్వసనీయత పెంచుకునే పనిలో కేసీఆర్ పడ్డారని.. వ్యవసాయ మార్కెట్ల ఆదాయం తగ్గినా.. రాష్ట్రం భరిస్తుంది అని కేసీఆర్ చెప్పారని పేర్కొన్నారు. కొత్త చట్టాల అమలు కోసం నష్టాన్ని కూడా భరిస్తా అంటున్నారని… రైస్ మిల్లలర్ల కు ప్రభుత్వం అజెంట్స్ గా మారిందని నిప్పులు చెరిగారు. పంట రుణమాఫీ ప్రస్తావన ఇప్పటికి లేదని.. రైతు బంధు నెపంతో.. రైతుకు అందే బెనిఫిట్స్ ఇవ్వకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. పసుపు రైతులు మద్దతు ధర లేక నష్టపోతున్నారని.. పసుపు బోర్డు లేదు.. గిట్టుబాటు ధరలు లేవని మండిపడ్డారు. నిజంగా ఎంపీ అరవింద్ కాపుదనపొడే అయితే పసుపు రైతు కు మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. జనవరి 30న ఆర్మురులో పసుపునకి మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ దీక్ష చేస్తున్నామని తెలిపారు జీవన్‌రెడ్డి.

Related posts