telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఎన్నికల విషయంలో కోర్టుకెళ్తానంటున్న ట్రంప్…

trump usa

యూఎస్ ఎన్నికల ఉద్రిక్త పరిస్థితి మరింత పెరిగింది. అయితే ఎన్నికల ఫలితాలు వస్తున్న కొద్ది దేశంలో అల్లర్లు, నిరసనలు పెరుగున్నాయి. ఇంతలోనే అమెరికా వైట్ హౌస్‌లో ట్రంప్ ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషాలకి మాట్లాడిన ట్రంప్ ముందుగా తన కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపాడు. తరువాత తనను గెలిపించిన ఓటర్లకు, తన వెంట ఉన్న అభిమానులకు తనను ప్రోత్సహించిన వారికి తాను రుణపడి ఉంటానని అన్నారు. అంతేకాకుండా పెన్సల్‌వేనియాలో తాను లాడ్‌లో ఉన్నాని అన్నాడు. అయితే అప్పుడే విజేత ఎవరో తేల్చడం కష్టమనే చెప్పుకోవాలి. తాజాగా అందిన సమాచారం ప్రకారం జో బైడెన్ 225 సీట్లను గెలిచి ట్రంప్ కన్నా 12 సీట్ల ఆధిక్యం సాధించాడు. అయితే ట్రంప్‌ కూడా 213 సీట్లను గెలిచి మంచి పోటీని ఇస్తున్నాడు. అయితే అతి తక్కువ సమయానికే ట్రంప్ తన మాటను మార్చాడు. ఎన్నికల్లో మోసం జరిగిందని, ప్రజలను మోసం చేస్తే చూస్తూ ఉండనని ట్రంప్ అన్నారు. దానికి తోడు నిజానికి మేమే గెలిచామని, ఎక్కడో మోసం జరిగిందన్నారు. న్యాయాన్ని మేము సరిగ్గా వాడుకుంటామని, కావాల్సివస్తే సుప్రీం కోర్టుకు వెళతానని ట్రంప్ తెలిపారు.

Related posts