telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బోయినపల్లి కిడ్నాప్ కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి…

ఏపీ మాజీ మంత్రి,టీడీపీ నేత భూమా అఖిలప్రియ బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏ1 గా ఉన్న సంగతి తెలిసిందే.  అఖిలప్రియను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  హాఫిజ్ పేట భూముల విషయంలో కిడ్నాప్ కు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే, ఈ కేసులో ఏ2గా ఏవీ సుబ్బారెడ్డిని, ఏ3 గా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను చేర్చారు.  అయితే, భార్గవ్ రామ్ ఎక్కడ ఉన్నాడో పోలీసులు ఇప్పటి వరకు గుర్తించలేదు.  నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.  ఇక ఇదిలా ఉంటె, భూమా కుటుంబానికి  భార్గవ్ రామ్ గురువుగా మారాడని అంటున్నారు. సెటిల్మెంట్లకు పురిగొల్పడం, ప్లాన్ చేయడం భార్గవ్ కి పనిగా మారిందని అంటున్నారు పోలీసులు. పాత లెక్కలన్నీ భార్గవ్ రామ్ ముందు అఖిలప్రియ ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. వేల కోట్ల సెటిల్మెంట్లకు భార్గవ్ రామ్ ప్లాన్లు వేసినట్టు గుర్తించారు. సెటిల్మెంట్లపై అఖిలప్రియ, జగత్ విఖ్యాత్, లకు భార్గవ్ రామ్ బ్రెయిన్ వాష్ చేసినట్టు చెబుతున్నారు. కిడ్నాప్ లు, బెదిరింపులు, కిరాయి మనుషులు ఇదే పంధాలో భార్గవ్ రామ్ ఉన్నాడని అంటున్నారు. ఆదిలోనే బొక్క బోర్లా  పడడంతో దిక్కుతోచని స్థిలో అఖిలప్రియ ఉందని అంటున్నారు. ఈ కిడ్నాప్ కేసులో అనేక మంది నిందితులను పోలీసులు గుర్తించారు. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో భూమా జగత్ విఖ్యాత్, భార్గవ్ అమ్మ నాన్న, భార్గవ్ తమ్ముడు చంద్రహాస్ పేర్లను కూడా చేర్చినట్టు చెబుతున్నారు. ఈ బోయినపల్లి కిడ్నాప్  కేసు ఎఫ్ ఐ అర్లో భార్గవ్ ఫ్యామిలీ మొత్తాన్ని పోలీసులు చేర్చినట్టు చెబుతున్నారు.

Related posts