బోయినపల్లి కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. కేసీఆర్ సమీప బంధువులను కొంతమంది కిడ్నాప్ చేయడంతో పోలీసు శాఖ అప్రమత్తం అయ్యింది. ఈ కేసులో ఏ 1 గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2 గా భూమా అఖిలప్రియ, ఏ3 గా భార్గవ్ రామ్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే అఖిలప్రియ భర్త భార్గవ రామ్ లొంగిపోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అఖిల ప్రియతో పాటు.. కిడ్నాప్‌లో పాల్గొన్నవారిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.. ఈ కేసులో ఏ-1గా ఉన్న అఖిలప్రియ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినా.. బెయిల్ వచ్చే సానుకూల పరిస్థితులు కనిపించడంలేదు. మరోవైపు.. పరారీలో ఉన్న భార్గవరామ్.. లొంగిపోవడానికి వస్తున్నాడన్న సమాచారంతో.. సికింద్రాబాద్ కోర్టు దగ్గర అలెర్ట్ అయ్యారు పోలీసులు.. కోర్టు లోపలకి వచ్చి భార్గవరామ్ లొంగిపోతాడాని ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు.. భారీకేడ్లు పెట్టి కోర్టు తలుపులు మూసివేశారు.. అయితే.. వాయిదాల కోసం వచ్చిన వారిని కోర్టు బయటే ఉంచారు పోలీసులు.. దీంతో పోలీసులకు, అడ్వకేట్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ లాయర్లు మండిపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post