telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఎన్టీఆర్-త్రివికర్ సినిమాలో పూజ ఫిక్స్…?

Pooja

అల వైకుంఠపురములో సినిమా తరువాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఆ సినిమా లో హీరోయిన్ అలాగే మిగితా నటీనటులు సాంకేతిక బృందం కు సంభంధించిన వివరాలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ‘పూజా హెగ్డే, రష్మిక’ వీరిద్దరిలో ఎవరిని తీసుకుంటారో అని ఎప్పటినుండో టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్స్ వీళ్లే. అయితే త్రివిక్రమ్-ఎన్టీఆర్ కంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత’ లో పూజా హెగ్డే హీరోయిన్ అయితే ఆ సినిమా హిట్ కావడంతో అప్పుడు నిర్వహించిన సక్సెస్ మీట్ లో  పూజా కు ఇంకో అవకాశం ఇస్తా అని చెప్పి ‘అల వైకుంఠపురములో’ ఇచ్చాడు. అయితే పూజ ఉన్న రెండు సినిమాలు త్రివిక్రమ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్ అందుకే మళ్ళీ తననే తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నాడట… పూజా హెగ్డేతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడట త్రివిక్రమ్. అంటే ఒకవేళ త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాలో వచ్చిన సినిమా కూడా హిట్ అయితే దర్శకుడు-హీరోయిన్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సాధించిన అతి కొద్దీ జంటలలో విటు నిలుస్తారు..

Related posts