telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

రేపటి నుంచి కనుమరుగు కానున్న ఆంధ్రా బ్యాంక్!

sub staff notification in andhrabank

కేంద్రం బ్యాంకుల విలీనం చేపట్టడంతో ఆంధ్రా బ్యాంకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూనియన్‌ బ్యాంకులో విలీనం కానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితంగా ఉన్న ఆంధ్రా బ్యాంక్ ఇక కనుమరుగు కానుంది. స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో 1923లో ఆంధ్రా బ్యాంకు ను స్థాపించారు.ఆంధ్రాబ్యాంకుతో పాటు కార్పొరేషన్‌ బ్యాంకు కూడా యూనియన్ బ్యాంక్‌లో విలీనం అవుతోంది.

కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ), కెనెరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకులో అలాహాబాద్ బ్యాంక్ విలీనం కానున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా, బ్యాంకుల ఏకీకరణ ప్రక్రియతో 2017లో 27 గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఇప్పుడు 12 కు తగ్గిపోతుంది. విలీనంత కస్టమర్లకు మెరుగైన సేవలు అందడంతో పాటు బ్యాంకుల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. బ్యాంకుల విలీనం ప్రక్రియ పూర్తైతే దేశంలో ఏడు పెద్ద బ్యాంకులు ఐదు చిన్న బ్యాంకులు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Related posts