telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

రైతుల ట్రాక్టర్‌ ర్యాలీపై ఉగ్ర మూకల దృష్టి…

punjob farmers

గణతంత్ర దినోత్సవం రోజునే ఢిల్లీలో ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారు రైతులు.. దీంతో.. రాజధానిలో వేల సంఖ్యలో బలగాలను మోహరించారు. ఒక్క రాజ్‌పథ్‌లోనే 6 వేల మంది సాయుధ పోలీసుల్ని దించారు. ర్యాలీకి లక్షల సంఖ్యలో ట్రాక్టర్లు తరలించాలని భావించినా… కేవలం ఐదు వేల ట్రాక్టర్లకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ పరిసరాల్లో 100 కి.మీ. పరిధిలో ర్యాలీ తీయబోతున్నారు… రైతులు. ఘాజీపూర్, సింఘు, టిక్రి సరిహద్దుల నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. దీనికి 3 రోడ్లను కేటాయించారు. ఎలాంటి ఆందోళనలూ, నినాదాలూ చేయకూడదనీ, పోస్టర్లు అంటించకూడదని షరతు పెట్టారు. దీనికి 30కి పైగా రైతు సంఘాలు కూడా ఒప్పుకున్నాయి. ట్రాక్టర్ల ర్యాలీని ఒకే రూట్‌లో కాకుండా విభిన్న మార్గాల్లో నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు తెలిపారు. ఎలాంటి హింసకు తావులేకుండా శాంతియుతంగా చేస్తామంటున్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని, వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. ట్రాక్టర్‌ ర్యాలీ రూట్‌ మ్యాప్‌ ఇస్తే .. ఆ మార్గంలో బారికేడ్లను తొలగిస్తామని తెలిపారు.  మరోవైపు రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీని భగ్నం చేసేందుకు ఐఎస్‌ఐ, ఖలిస్తాన్‌ సంస్థలు కుట్ర పన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ట్రాక్టర్‌ ర్యాలీలో విధ్వంసం సృష్టించేందుకు… ఉగ్ర మూకలు భారీ కుట్రకు తెరలేపాయని పోలీసులు చెబుతున్నారు. చూడాలి మరి ఈ రోజు ఏం జరుగుతుంది అనేది.

Related posts