telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్‌డీఎక్స్ లవ్ : పాయల్ బాగా కోపరేట్ చేసింది… హీరో వ్యాఖ్యలు వైరల్

RDX-Love

“ఆర్ఎక్స్ 100” చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్‌ ప్ర‌స్తుతం “ఆర్‌డీఎక్స్ లవ్” అనే చిత్రం చేస్తుంది. శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌నున్న ఈ చిత్రానికి ర‌ధ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం నాయిక ప్రాధాన్య‌త ఉన్న చిత్రంగా ఉంటుంద‌ని స‌మాచారం. ఇటీవలే చిత్ర ఫ‌స్ట్‌లుక్ వెంక‌టేష్ చేతుల మీదుగా విడుద‌లైంది. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయినట్టు సమాచారం. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ వెరైటీ డాన్స్‌తో ఆకట్టుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఈ డాన్స్ హైలెట్ అని చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ లాంచ్ సందర్భంగా పాయల్ రాజ్ పుత్ ని ఉద్దేశిస్తూ తేజుస్ కంచర్ల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తేజు మాట్లాడుతూ “హీరోయిన్ బోల్డ్ గా డైలాగులు చెప్పడం తెలుగులో ఇదే తొలిసారి. ఈ చిత్ర టీజర్ విడుదలైనప్పుడు అందరూ విమర్శించారు. కానీ ట్రైలర్ చూశాక అభిప్రాయం మారుతుంది. ఇక పాయల్ ఈ చిత్రంలో బాగా కోపరేట్ చేసింది. కోపరేట్ చేసింది అంటే బాగా చేసింది అని అర్థం… మీరు వేరేలా అనుకోవద్దు” అని సరదాగా కామెంట్ చేశాడు. ఆ సమయంలోవెనుకనే ఉన్న పాయల్ అతడి గొంతు పట్టుకుంది. ఈ సరదా సన్నివేశం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Related posts