telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

రేపు బాబ్రీ మసీద్ కూల్చివేత తీర్పు…భ‌ద్ర‌త పెంచాలని కేంద్రం ఆదేశం!

Babri masijid

 డిసెంబ‌ర్ 6వ తేదీ, 1992 వ సంవత్సరంలో యోధ్య‌లోని బాబ్రీ మ‌సీదును ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఈనెల 30వ తేదీన తుది తీర్పు వెలుబ‌డ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. సున్నిత‌మైన‌, స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో భ‌ద్ర‌తను పెంచాలంటూ ఆదేశించారు.

సీబీఐకి చెందిన ప్ర‌త్యేక కోర్టు బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో రేపు ల‌క్నోలో తీర్పును ఇవ్వ‌నున్న‌ది. ఈ తీర్పు వ‌ల్ల శాంతిభ‌ద్ర‌త‌ల‌పై స‌మ‌స్య త‌లెత్తే ప్ర‌మాదం ఉంద‌ని తెలిల్పింది. తీర్పు నేపథ్యంలో రెండు వ‌ర్గాల చెందిన వారు అల్ల‌ర్ల‌కు దిగే అవ‌కాశం ఉంద‌ని కేంద్రం త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది.

బాబ్రీ మ‌సీదు కేసులో నిందితులు దోషులుగా తేలుతార‌ని కొన్ని ముస్లిం సంఘాలు భావిస్తున్నాయ‌ని, ఒక‌వేళ తీర్పు వారి ప‌క్షం లేకుంటే దాడులు జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. మ‌త‌ప‌రంగా సున్నితంగా ఉండే జిల్లాల్లో భ‌ద్ర‌త‌ను పెంచాల‌ని కేంద్రం సూచించింది.

Related posts