telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై హరీశ్ రావు ఫైర్

Harish Rao TRS

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు కోసం కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. పోతిరెడ్డిపాడు నుంచి ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు రోజుకు 3 టీఎంసీల నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

తాజాగా ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు కూడా మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షమని అన్నారు. 805 లెవెల్ లో లిఫ్ట్ పెడుతున్నారంటే తెలంగాణపై కుట్రకు పాల్పడుతున్నట్టేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అపెక్స్ కమిటీ అనుమతి కూడా లేకుండానే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం చెప్పేదానికి చేసేడానికి పొంతన లేదన్నారు.

Related posts