2018లో అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అందుకున్న ఆరెక్స్ 100 రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా 20 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఆ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ తెలుగులో మోస్ట్ హ్యపెనింగ్ హీరోయిన్ గా వరుస అవకాశాలను అందుకుంటుంది. ఆరెక్స్ 100 హీరో కార్తికేయ కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఆరెక్స్ 100 సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ అగ్ర హీరో సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి హీరోగా… తారా సుటారియా హీరోయిన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు హిందీలో ‘తడప్’ పేరును ఖరారు చేశారు. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ అక్షయ్ కుమార్ రిలీజ్ చేశారు. అయితే మిలన్ లూథ్రియా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్24న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే తెలుగులో ఈ సినిమాకు ఖచ్చితంగా ఈ సినిమాకు సీక్వెల్ ను తీస్తాను అని అజయ్ భూపతి ప్రకటించాడు. సీక్వెల్ స్టోరీ కూడా కార్తికేయకు సూట్ అయ్యేలా ఉంటుందని అన్నాడు. ఇక ఈ సీక్వెల్ కు హీరోయిన్ గా కొత్త అందాన్ని తీసుకోవాలని అనుకుంటున్నారట.
previous post
ఇసుక కొరతతో 30 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి: చంద్రబాబు